మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భేటీ అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ సహా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, బీహార్ సీఎం నితీష్ కుమార్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయారాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలపై చర్చిస్తున్నారు. అదేవిధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అభివృద్ధి కార్యక్రమాలు చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, డీజీపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.