కేంద్రహోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో సమీక్ష ప్రారంభమైంది. ఈ సమావేశానికి బీహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరవ్వగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రాలేదు.
ఏపీ తరఫున హోంమంత్రి అనిత, సీఎస్ నీరభ్ ప్రసాద్, డీజీపీ హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు. ఈ సమావేశంలో సీఎంలతో పాటు సంబంధిత శాఖ కేంద్ర అధికారులు కూడా ఉన్నారు. 2026 నాటికి ఆయా రాష్ట్రాల్లో నక్సలిజాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఈ సమీక్ష జరుగుతోంది.
- Advertisement -