Saturday, November 23, 2024

Kavitha | ఎమ్మెల్సీ కవితకు ఇంటి భోజనం .. జైల్లో ఆ వెసులుబాటు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను.. రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైలుకు తరలించారు. కాగా, కవిత విజ్ఞప్తి మేరకు జైలులో వెసులుబాటు కల్పించింది కోర్టు. ఇంటి భోజనం తెచ్చుకునేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే కవిత బెడ్, పరుపులు, దుప్పట్లు.. వేసుకోవడానికి చెప్పులు, బట్టలతో పాటు చదువుకునేందుకు పుస్తకాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేశారు.

అలాగే.. పెన్ను, పేపర్లు, నగలు, మందులు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. కస్టడీలో ఉన్న కవిత వైద్యానికి సంబంధించిన అన్ని రికార్డులను ఆమె లాయర్లకు అందజేయాలని కోర్టు ఈడీని ఆదేశించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1లోగా సమాధానం ఇవ్వాలని ఈడీని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement