Tuesday, November 26, 2024

అమ్మకానికి స్వగృహ.. పోచారంలో 9 అంతస్తుల్లో నాలుగు టవర్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇప్పటికే నగరంలోని రెండు ప్రాంతాల్లో రాజీవ్‌ స్వగృహ ఇళ్ళను దాదాపు అమ్మేసిన ప్రభుత్వం, మరో రెండు చోట్ల అమ్మకానికి నిర్ణయించింది. పోచారం, గాజుల రామారంలలో స్వగృహ టవర్స్‌ అమ్మేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ హెచ్‌ఎండీఏకు అదేశాలు ఇచ్చింది. మేడ్చల్‌ జిల్లాలోని పోచారం, గాజుల రామారం టౌన్‌షిప్‌ల పరిధిలో పూర్తిగా నిర్మాణం కాని రాజీవ్‌ స్వగృహ టవర్లను యధాస్థితిలో విక్రయించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. వీటికి సంబంధించి ఇప్పటికే హెచ్‌ఎండిఏ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అందులో భాగంగా ఈ నెల 9న హెచ్‌ఎండిఏ, రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు ఫ్రీ బిడ్‌ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

- Advertisement -

పోచారంలో 9 అంతస్తులతో నాలుగు 4 టవర్లు ఉండగా, వాటిల్లో ఒక్కొక్క టవర్‌లో కనీసం 72 నుంచి 198 ప్లాట్‌లను నిర్మించుకునే సదుపాయం ఉంది. అదేవిధంగా గాజుల రామారంలో 14 అంతస్తులతో ఐదు 5 టవర్లు ఉండగా ఒక్కో టవర్‌లో 112 ప్లాట్‌ లను నిర్మించుకునే సదుపాయంతో అసంపూర్తి దశలోనే అమ్మకానికి పెట్టారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో ఉన్న ఈ స్వగృహ టవర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తిగల బిల్డర్లు, డెవలపర్లు, సొసైటీలు, వ్యక్తులు జనవరి 30లోపు రూ.10 లక్షలు ధరావత్తును డిమాండ్‌ డ్రాప్ట్‌ రూపంలో చెల్లించాల్సి ఉంటు-ంది. ధరావత్తు చెల్లించిన దరఖాస్తుదారుల ఎంపిక పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా జరుగుతుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement