Tuesday, November 26, 2024

ఇంటి భోజనమే ఆరోగ్యానికి రక్ష.. రోడ్ సైడ్ ఫుడ్ డేంజర్ అంటున్న డబ్ల్యూహెచ్ వో

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇంటి భోజనమే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని డబ్ల్యూ హెచ్‌వో (ప్రపంచ ఆరోగ్య సంస్థ) స్పష్టం చేస్తోంది. బయట దొరికే రకరకాల ఆహారాన్ని ఆరగిస్తే మంచం పట్టక తప్పదని హెచ్చరిస్తోంది. ఆరు బయట దొరికే ఫాస్ట్‌ ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌, ఇతర ఆహార పదర్థాలు ఎంత ఖరీదువైనా ఖర్చుకు వెనకాడకుండా వెచ్చించి తింటే ఒళ్లు గుల్లగా మారడం ఖాయమని తేల్చి చెబుతోంది. ఇంటి భోజనాన్ని కాదని బయట ఫుడ్‌ తినే ప్రతి 10 మందిలో కచ్చితంగా ఒక్కరైనా తీవ్ర అనారోగ్యం బారిన పడాల్సి వస్తోందని డబ్ల్యూహెచ్‌వో పలు దేశాల్లో నిర్వహించిన తాజా సర్వే స్పష్టం చేస్తోంది. కలుషితమైన, అనారోగ్యకరమైన ఆహారం తినడం మూలాన ఫుడ్‌ పాయిజినింగ్‌ అయి ఏటా ప్రపంచ వ్యాప్తంగా 4లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఇందులో 40శాతం మంది 5ఏళ్లలోపే చిన్నారులే ఉంటుండడం గమనార్హం. ప్రపంచంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఎక్కువగా బయట వీధుల్లో, మార్కెట్లలో దొరికే ఆహారాన్ని భుజిస్తున్నారు. రెస్టారెంట్లు, ప్రముఖ హోటళ్లలో ఆహారాన్ని రుచి కోసం 5 డిగ్రీ ల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో కూడిన మంటపై సిద్ధం చేస్తుండడం, వేపుళ్లు, ఫ్రై చేసిన ఆహారాన్ని ఇష్టపడే వారి కోసం 60 డిగ్రీల ఉష్ణోగ్రత కంటే అధికంగా ఉండే మంటపై సిద్ధం చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో సర్వేలో తేలింది. ఫలితంగా ఆహారంలో ఉండాల్సిన సూక్ష్మ పోషకాలు పూర్తిగా తొలగిపోవడం లేదా తక్కువ మోతాదుకు పడిపో తున్నాయి.

బయట హోటళ్లు, రెస్టారెంట్లలోని ఆహార నాణ్యతను ఫుడ్‌ థెర్మోమీటర్‌తో తనిఖీలు చేయాలని ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులకు డబ్ల్యూహెచ్‌వో సూచించింది. కలుషిత, నాణ్య తలేని, అనారోగ్యకర ఆహారాన్ని భుజిస్తున్న కారణంగా ప్రపంచంలోని 149 మిలి యన్ల చిన్నారులు పోషకాహార లోపంతో బాధప డుతున్నారు. ఈ పరిణామం చిన్నారులు వయసుకు తగినంత బరువు, ఎదు గుదల లేక పోవడానికి కారణమవుతోంది. జంక్‌ ఫుడ్‌, కలు షిత, నాణ్యతలేని ఆహారం తీసుకోవడం ద్వారా దాదాపు 45మిలియన్ల చిన్నారులు వయసుకు తగిన బరువు ఉండడం లేదు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement