Tuesday, November 19, 2024

పట్టు పట్టి, అర్హత సాధించి.. 800 మీటర్ల పరుగులో మహిళా అభ్యర్థులు

కరీంనగర్: పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు పోలీసు శాఖ అర్హత పరీక్షల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందు ఉంటామని పరుగు,దేహదారుఢ్య అర్హత పరీక్షల్లో పాల్గొంటున్నారు.రెండు రోజులుగా కరీంనగర్‌ పోలీసు శిక్షణ కేంద్రం(సీటీసీ)లో మహిళా అభ్యర్థులకు అర్హత పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం జరిగిన పరీక్షల్లో 888 మంది అర్హత సాధించారంటే అర్థం చేసుకోసుకోవచ్చు వారు ఎంతగా శ్రమిస్తున్నారో. సోమవారం జరిగిన అర్హత పరీక్షల నిర్వహణకు 1234 మందికి అడ్మిట్ కార్డులు జారీ చేశారు.ఇందులో 97 మంది గైర్హాజయ్యారు.

మిగిలిన 1137 మందిలో 62 మంది అనారోగ్యం, ఇతర కారణాలు చూపుతూ ధ్రువపత్రాలు సమర్పించారు.
పోటీల్లో పాల్గొన్న 1075 మందిలో 187 మంది అర్హత పోటీల్లో విఫలమయ్యారు. కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన అంకిత 800 మీటర్ల పరుగు పూర్తి చేసే క్రమంలో కింద పడిపోగా కుడి కాలుకు గాయమైంది.108 వాహనంలో మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.అర్హత పరీక్షలను కరీంనగర్‌ సీపీ వి.సత్యనారాయణ, అదనపు డీసీపీ చంద్రమోహన్‌ తదితరులు పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement