మహిళల హాకీ 5 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా టోర్నీని ముగించింది. ఒమన్ వేదికగా ఇవ్వాల (ఆదివారం) జరిగిన ఫైనల్స్‌లో నెదర్లాండ్స్‌తో తలపడిన భారత్ 7–2 తేడాతో ఓటమిపాలయ్యింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ మొదటి నుంచే అటాకింగ్‌గా ఆడారు. ఫస్ట్ హాఫ్ లో (2,4,8,11,13,14 నిముషాల్లో) వరుసగా గోల్స్ చేసింది నెదర్లాండ్స్ జట్టు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి 6–0 తో ఆధిక్యంలో నిలిచింది.
అయితే, సెకండ్ హాఫ్‌లో భారత మహిళల జట్టు పుంజుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సెకండ్ హాఫ్ లో భారత జట్టు (20,,23 నిముషాల్లో) రెండు గోల్స్ చేయగా.. నెదర్లాండ్స్ జట్టు (27వ నిముషంలో) మరో గోల్ చేసింది. దీంతో నెదర్లాండ్స్ 7–2 పాయింట్లతో మ్యాచ్‌ను ముగించి మహిళల హాకీ 5 ప్రపంచకప్ టైటిల్‌ని సొంతం చేసుకోగా.. భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది.
ఇక, రేపటి (ఆదివారం) నుంచి పురుషుల హాకీ 5 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. కాగా, పురుషుల FIH హాకీ 5s ప్రపంచ కప్‌లో భారత జట్టు ఈజిప్ట్, జమైకా, స్విట్జర్లాండ్‌లతో పాటు గ్రూప్ బీలో ఉంది. ఇక గ్రూప్ ఏ లో నెదర్లాండ్స్, నైజీరియా, పాకిస్థాన్, పోలాండ్ జట్లు తలడనున్నాయి. గ్రూప్ సిలో ఆస్ట్రేలియా, కెన్యా, న్యూజిలాండ్, ట్రినిడాడ్ & టొబాగో ఉండగా.. ఫిజీ, మలేషియా, ఆతిథ్య జట్టు ఒమన్, యునైటెడ్ స్టేట్స్ పూల్ D లో పోటీపడనున్నాయి.