ప్యారిస్ ఒలింపిక్స్ లో భాగంగా నేడు జరిగాన భారత హాకీ పురుషుల మ్యాచ్ డ్రాగా ముగిసింది. పూల్-బి లో ని రెండో మ్యాచ్‌లో భారత పురుషుల హాకీ జట్టు – పటిష్టమైన అర్జెంటీనాతో తలపడగా మ్యాచ్‌ను 1-1 స్రోర్‌తో డ్రాగా ముగించింది. మ్యాచ్ ప్రారంభమైన తొలి అర్ధభాగంలోనే అర్జెంటీనా ఆటగాడు లూకాస్ మార్టినెజ్ 22వ నిమిషంలో గోల్ చేసి ఆ జట్టకు ఆధిక్యాన్ని అందించాడు.
ఈ మ్యాచ్ లో ఆఖరి నిమిషం వరకు భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అయితే, చివరి 59వ నిమిషంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో చివరి నిమిషంలో భారత జట్టు గోల్ చేసి 1-1తో మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్ తర్వాత భారత్ జట్టు 4 పాయింట్లతో గ్రూప్-బిలో మూడో స్థానంలో ఉంది.
భారత జట్టు తన తదుపరి మ్యాచ్‌లో రేపు ఐర్లాండ్‌తో తలపడనుండగా… ఆగస్టు 1న బెల్జియంతో, ఆగస్టు 2న ఆస్ట్రేలియాతో తలపడనుంది.