Wednesday, January 8, 2025

HMPV – నాలుగుకు చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు – అల‌ర్ట్ అయిన అన్ని రాష్ర్టాలు

కోలో క‌తా – చైనా కొత్త వైర‌స్ హెచ్‌ఎంపీవీ లక్షణాలు మ‌న దేశం నలుమూలలా బయటపడుతున్నాయి. తాజాగా, కోల్‌కతాలో ఐదున్నర నెలల చిన్నారితో హెచ్‌ఎంపీవీ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. చిన్నారి బైపాస్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. చిన్నారి తల్లిదండ్రుల స్వస్థలం ముంబై కాగా, ఇటీవల వారు కోల్‌కతా వచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. కోల్‌కతా వచ్చాక చిన్నారి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబీకులు బైపాస్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.

అనుమానంతో వైద్యులు వైరల్ పిసిఆర్ పరీక్ష చేయగా.. హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా తేలింది. ఆ చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు బెంగుళూరులో 2, అహ్మదాబాద్ లో ఒక కేసు న‌మోదు కాగా కొత్త‌గా కోల్ కోతాలో నాలుగో కేసు బ‌య‌ట‌ప‌డింది. హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా తేలిన నలుగురూ చిన్న పిల్లలే. ఏడాదిలోపు వారే కావ‌డం విశేషం… అప్ప‌డే పుట్టిన శిశువు నుంచి 11 ఏళ్ల లోపు చిన్నారులు ఈ వ్యాధి భారీన ప‌డే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement