Tuesday, January 7, 2025

HMPV – చైనా కొత్త వైరస్ వచ్చేసింది – బెంగళూర్ లో తొలి కేసు నమోదు

బెంగళూర్ – చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంటర్ అయింది. బెంగళూరులో ఎనిమిది నెలల పాపకు హెచ్ఎంపీవీ వైరస్ సోకింది. నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రిలో ఈ కేసు వెలుగు చూసింది. అలాగే మరో మూడు నెలల చిన్నారికి సైతం ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా, ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుండి వచ్చిన నివేదిక ప్రకారం శిశువు పాజిటివ్ పరీక్షించిందని రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీనిపై ఇంకా తమ ల్యాబ్ లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు. ప్రైవేట్ ఆసుపత్రి పరీక్షలను తాము అనుమానించాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఫ్లూ నమూనాలలో దాదాపు 0.7%. హెచ్ఎంపీవీ గా గుర్తించబడ్డాయి. ఇండియాలో ఇదే తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హం. హెచ్ఎంపీవీ లేదా హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ సాధారణంగా 11 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement