Tuesday, November 26, 2024

థియేటర్స్ లో ఫట్ట్.. యూట్యూబ్ లో హిట్స్

కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఆడకపోయినా యూట్యూబ్ లో మాత్రం దూసుకుపోతుంటాయి. అలా హీరో రామ్ చిత్రాలు కూడా యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ ని దక్కించుకున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.. ది వారియర్ సినిమాతో కూడా అదే తరహాలో వంద మిలియన్ల వ్యూవ్స్ అందుకోగా రామ్ పోతినేని ఒక రికార్డును క్రియేట్ చేశాడు. సౌత్ ఇండస్ట్రీలోనే వరుసగా ఏడు హిందీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకున్న హీరోగా అతను రికార్డు క్రియేట్ చేశారు. ది వారియర్ సినిమాను తమిళ దర్శకుడు లింగస్వామి రెండు భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమా యూట్యూబ్ లో మాత్రం ఒక సంచలనం క్రియేట్ చేసింది.

హీరో రామ్ పోతినేని హిందీ డబ్బింగ్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇటీవల ఈ సినిమాను కూడా యూట్యూబ్ లో హిందీలో డబ్ చేసి విడుదల చేయగా ఏకంగా వంద మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకుంది. ఇంతకుముందు కూడా రామ్ పోతినేని నటించిన కొన్ని సినిమాలకు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. అందులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉండడం విశేషం. ముఖ్యంగా మొదటిసారి గణేష్ సినిమా తోనే రామ్ హిందీ ఆడియోన్స్ ను బాగా అట్రాక్ట్ చేశాడు. డీసెంట్ రొమాంటిక్ ఫిలిం గా వచ్చిన ఆ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఇక నేను శైలజ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా హిందీలో డబ్బింగ్ చేయగా యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది.అలాగే ఉన్నది ఒకటే జిందగీ హలో గురు ప్రేమకోసమే హైపర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ వెర్షన్ లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఆ సినిమాలు యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement