హైదరాబాద్ వేదికగా ఇవ్వాల (మంగళవారం) రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌పై సోంతం చేసుకున్నాడు. 2008 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న రోహిత్ ఇప్పటి వరకు 231 మ్యాచ్‌లు ఆడాడు. 129.93 స్ట్రైక్ రేట్‌తో 5,986 పరుగులు చేశాడు. దీంతో ఇవ్వాల్టి మ్యాచ్‌లో 6,000 పరుగులు చేసిన రికార్డులోకి అడుగు పెట్టాలంటే 14 పరుగులు చేయాల్సి ఉండగా.. 18 బాల్స్ లో 28 రన్స్ చేసిన రోహిత్ 6,000 వేల పరుగులు చేసిన అరుదైన క్లబ్‌లో అడుగు పెట్టాడు.
కాగా, ఇప్పటి వరకు ఈ క్లబ్‌లో విరాట్ కోహ్లీ (6,844 పరుగులు), శిఖర్ ధావన్ (6,477), డేవిడ్ వార్నర్ (6,109) మాత్రమే ఉన్నారు. ఈ రికార్డ్ తో.. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 6 వేల పరుగుల మార్క్‌ని చేరుకున్న నాలుగో ప్లేయర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు.