Monday, November 25, 2024

PAK vs BAN | పాక్ కు షాక్.. బంగ్లా కొత్త చ‌రిత్ర‌

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ సంచలనం సృష్టించింది. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రావల్పండి వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌ను బంగ్లాదేశ్ ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో రెండు మ్యాచ్ల ఈ టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన బంగ్లా… పాకిస్థాన్‌పై తొలిసారి టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది.

- Advertisement -

కాగా, ఓవర్‌నైట్ స్కోరు 42/0తో అయిదో రోజు 185 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్, 51 బంతుల్లో, 1 ఫోర్), షకిబ్ అల్ హసన్ (21 నాటౌట్, 43 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఓపెనర్ జకీర్ హసన్ (40; 39 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్.

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 స్కోరు చేసింది. సయిమ్ అయుబ్ (58; 110 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. మెహదీ హసన్ ఐదు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకు ఆలౌటైంది. 26/6తో కష్టాల్లో ఉన్న జట్టును లిటన్ దాస్ (138; 228 బంతుల్లో, 13 ఫోర్లు, 4 సిక్సర్లు) గొప్పగా ఆదుకున్నాడు. పాక్ బౌలర్లలో ఖురమ్ ఆరు వికెట్లు పడగొట్టాడు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో పాక్ 172 పరుగులకే కుప్పకూలింది. అఘా సల్మాన్ (47 నాటౌట్) టాప్ స్కోరర్. హసన్ మహ్మద్ ఐదు వికెట్లు తీశాడు. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా నాలుగు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement