మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయని.. ప్రజల అభివృద్ధి, అభ్యున్నతి కోసం మహాయుక్తి కూటమి ప్రభుత్వం ఇదే విధంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు.. జార్ఖండ్లో అధికారం దక్కించుకున్న ఇండియా కూటమికి ప్రధాని అభినందనలు చెప్పారు. బీజేపీ గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్రతీ ఒక్క కార్యకర్తను చూసి గర్వపడుతున్నట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు.