Tuesday, November 19, 2024

మరోసారి ధరలు పెంచిన హిందూస్తాన్ యూనీలీవర్.. సబ్సులు, డిటర్జెంట్ల రేట్ల పెంపు..

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందూస్తాన్‌ యూనీ లీవర్‌ (హెచ్‌యూఎల్‌) మరోసారి ధరలను పెంచింది. ఇటీవలి కాలంలో వరుసగా ధరలను పెంచుతోంది. రవాణా ఖర్చులు పెరగడం, రామ్ఖెటీరియల్‌ ఖర్చులు పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని చెబుతోంది. సబ్బులు, డిటర్జెంట్‌ ధరలు ఏప్రిల్‌ నెలలో మరోసారి పెంచింది. ఈసారి డోవ్‌, పియర్స్‌, లైఫ్‌బాయి, వీల్‌, విమ్‌ తదితర ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి సరుకుల ధరలు పెరగడంతో పాటు భవిష్యత్తులో మరింత పెరగనున్న నేపథ్యంలో ధరలను పెంచినట్లు తెలిపింది. తమ ఉత్పత్తులపై ఈసారి 3 శాతం నుండి 20 శాతం మేర పెంచింది. డోవ్‌, పియర్స్‌ సోప్‌ బార్స్‌ పైన 20 శాతం పెంచింది.

దీంతో 25 గ్రాముల డోవ్‌, పియర్స్‌ సోప్‌ ధర రూ.10 నుండి రూ.12కు పెరిగింది. లైఫ్‌బాయ్‌ సబ్బు (ఒక్కోటి 125 గ్రాములు) బండిల్‌ ధరను రూ.124 నుండి రూ.136కు పెంచింది. 500 గ్రాముల వీల్‌ ప్యాక్‌ ధరను రూ.32 నుండి రూ.33కు, కిలో వీల్‌ ప్యాక్‌ ధరను రూ.63 నుండి రూ.65కు పెంచింది. విమ్‌ లిక్విడ్‌ 500 గ్రాముల పౌచ్‌ ధరను రూ.99 నుండి రూ.104కు పెంచింది.అంతకుముందు ఫిబ్రవరి నెలలో తమ ఉత్పత్తులపై ధరలను పెంచింది. అప్పుడు లక్స్‌, లైఫ్‌బాయి, డోవ్‌ షాంపూ, కిసాన్‌ జామ్‌, హార్లిక్స్‌, పెప్సోడెంట్‌, సర్ఫ్‌ ఎక్సెల్‌, విమ్‌ బార్‌ ధరలను పెంచింది. అంతకుముందు జనవరి నెలలో సర్ఫ్‌ ఎక్సెల్‌ ధరలను 17 శాతం పెంచింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement