ముంబై: దేశాన్ని క్రమపద్ధతిలో దోచుకుంటూ భారత జెండాను కప్పుకున్న అదానీ గ్రూప్ భారతదేశ భవిష్యత్తును అడ్డుకుంటోందని ఆరోపించింది హిండెన్ బర్గ్. అదాని గ్రూప్ అవకవకలపై 86 ప్రశ్నలతో సుదీర్ఘ కథనాన్ని వెలుగులోకి తెచ్చిన హిండెన్ బర్గ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, తాము కథనంలో పేర్కొన్న ప్రతి అంశానికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది..
జాతీయవాదం పేరుతో అదాని గ్రూప్ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నిస్తోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ తన వేగవంతమైన, ఆకర్షణీయమైన అభివృద్ధిని, చైర్మన్ గౌతం అదానీ సంపద పెరుగుదలను భారత దేశ విజయానికి ముడిపెడుతోందంటూ దుయ్యబట్టింది. భారత దేశం శక్తిమంతమైన ప్రజాస్వామిక దేశమని, అది సూపర్ పవర్‌గా ఎదుగుతోందని పేర్కొన్న హిండెన్ బర్గ్ , అదానీ గ్రూప్ ఆ దేశ భవిష్యత్తును వెనక్కి లాగుతోందని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాదు తాము లేవనెత్తిన ప్రతి ప్రధాన ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా కప్పిపుచ్చి మోసాన్ని అడ్డుకోలేరంటూ ఘాటుగా స్పదించింది..తాము అడిగిన 66 ప్రశ్నలకు జవాబులు ఎక్కడ అంటూ అదాని గ్రూప్ ని ప్రశ్నించింది.