Thursday, November 21, 2024

150 కి.మీ దూరం నుంచి కనిపించిన హిమాలయ పర్వతాలు..

మంచు దుప్పటి కప్పుకున్న హిమాలయ శిఖరాలు ఈ ఏడాది వరుసగా రెండోసారి సహారాన్‌పూర్‌ పట్టణవాసులకు దర్శనమిచ్చి కనువిందు చేశాయి. సహారాన్‌పూర్‌ నుంచి అప్పర్‌ హిమాలయాలకు దాదాపు 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సహారాన్‌పూర్‌ పట్టణానికి చెందిన ఇద్దరు డాక్టర్లు, ఏ ప్రభుత్వ ఉద్యోగి ఈ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. వీటిలో వైద్యుడు వివేక్ బెనర్జీ తీసిన ఫొటో సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నది. ఫొటోగ్రఫీపై మంచి అభిరుచి ఉన్న యూపీ క్యాడర్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ అనే ఓ ఐఏఎస్‌ అధికారి సైతం ఈ ఫొటోను తన ట్విట్టర్‌లో షేర్‌ చేసి అద్భుత దృశ్యమంటూ రాసుకొచ్చారు.

30 నుంచి 40 ఏండ్లకు ఒకసారి ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని స్థానికులు అంటున్నారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా వాతావరణంలో కాలుష్యం తగ్గడం, తుఫాన్‌ తౌక్టే ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంచు తొలగి హిమాలయ పర్వత శిఖరాలు కనిపించినట్లు అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement