Tuesday, November 26, 2024

అక‌స్మాత్తుగా వ‌ర‌ద -కూలిన బ్రిడ్జ్-14మంది మృతి

ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల కార‌ణంగా కంగ్రా జిల్లాలో ఉన్న బ్రిడ్జ్ కూలింది. అక‌స్మాత్తుగా భారీ వ‌ర్షం..వ‌ర‌ద వ‌చ్చింది.దీంతో చక్కి నదిపై 800 మీటర్ల పొడవైన రైల్వే వంతెన పిల్లర్ కొట్టుకుపోవడంతో కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగ లేదు. పఠాన్‌కోట్, జోగిందర్‌నగర్ మధ్య 1928లో మొదటిసారిగా బ్రిటీష్ వారు ప్రారంభించిన రైలు సర్వీసులు వంతెనపై పగుళ్లు కనిపించడంతో గత నెలలోనే నిలిపివేశారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్.. ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పోటెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. ఇక చంబా జిల్లాలో శనివారం తెల్లవారుజామున కొండ చరియలు విరిగిపడడంతో ఓ ఇల్లు కూలిపోయింది. అందులో ఉన్న ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.కాంగ్రా, చంబా, బిలాస్‌పూర్, సిర్మౌర్, మండి జిల్లాలలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో మండి జిల్లాలో పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. వరదల కారణంగా మండి జిల్లాలో ఇళ్లు, దుకాణాలలోకి నీళ్లు చేరాయి. అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. ఆగస్టు 25 వరకు హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement