Saturday, November 23, 2024

హ్యాండ్‌బాల్‌ ఛాంప్‌ హిమాచల్‌, మూడో స్థానంలో తెలంగాణ..

జాతీయ సీనియర్‌ మహిళల హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ 2022 టైటిల్‌ను హిమాచల్‌ప్రదేశ్‌ జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో హిమాచల్‌ జట్టు 20-10 గోల్స్‌ తేడాతో రైలేస్‌ జట్టుపై విజయం సాధించింది. విజేత, రన్నరప్‌, మూడో స్థానంలో నిలిచిన జట్లకు తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, శాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, భారత్‌ ఒలింపిక్‌ సంఘం కోశాధికారి ఆనందీశ్వర్‌ పాండే, జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షులు జగన్‌ మోహన్‌ రావు కలిసి టైటిల్‌ను అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

త్వరలోనే శాట్స్‌, రాష్ట్ర ఒలింపిక్‌ సంఘం సహకారంతో హైదరాబాద్‌ వేదికగా అతిపెద్ద క్రీడా ఫెస్టివల్‌ను నిర్వహిస్తామన్నారు. గత రెండేళ్లుగా అంతర్జాతీయ హ్యాండ్‌ బాల్‌ పోటీలు నిర్వహిస్తున్న జగన్‌ మోహన్‌ రావును శ్రీనివాస్‌గౌడ్‌ అభినందించారు. గోపీ చంద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడా రంగానికి పెరిగిన ఆదరణ చూస్తుంటే.. ముచ్చట వేస్తోందన్నారు. హైదరాబాద్‌ హ్యాండ్‌బాల్‌కు హబ్‌గా మారుతున్నదన్నారు. జగన్‌ మోహన్‌ రావు మాట్లాడుతూ.. పోటీలను విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన రాష్ట్ర ప్రభుతానికి, భారత్‌ ఒలింపిక్‌ సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ స్థాయిలో భారత్‌ హ్యాండ్‌బాల్‌కు ప్రత్యేక గుర్తింపు తేవడమే తన లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement