టర్కీ నుంచి భారత్‌కు వస్తున్న కార్గో షిప్ ‘గెలాక్సీ లీడర్’ సముద్ర జలాలలో హైజాక్‌కు గురైంది. ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఈ నౌకను హైజాక్ చేశారు. ఈ షిప్లో వేర్వేరు దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారని సమాచారం. తాము ఇజ్రాయెల్ నౌకను స్వాధీనం చేసుకున్నామని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
కార్గో షిప్ హైజాక్‌కు గురైన విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నిర్ధారించింది. ఇందులో ఇజ్రాయెల్‌తోపాటు వివిధ దేశాల పౌరులు సిబ్బందిగా ఉన్నారని తెలిపింది. ఇది ఇజ్రాయెల్ నౌక కాదని వెల్లడించింది. మరోవైపు.. ఈ నౌకలో భారతీయులు ఎవరూలేరని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం వెల్లడించింది.
మరోవైపు ఇజ్రాయెల్‌కు చెందిన కార్గోషిప్‌ను యెమెన్ తీరానికి తీసుకెళ్లామని హౌతీ నేతల్లో ఒకరు పేర్కొన్నారు. కాగా నౌక సిబ్బందిలో ఉక్రెయిన్, బల్గేరియా, ఫిలిప్పైన్స్, మెక్సికోతోపాటు వేర్వేరు దేశాలకు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ నౌకను కిడ్నాపర్ల నుంచి విడిపించేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నాలు ప్రారంభించింది.