Tuesday, November 26, 2024

మధ్యప్రదేశ్‌ను తాకిన హిజాబ్‌, వర్సిటీ క్లాస్‌రూంలో నమాజ్‌

హిజాబ్‌ వివాదం మధ్యప్రదేశ్‌ను కూడా తాకింది. కర్నాటకలో మొదలైన ఈ వివాదం.. ఒక్కో రాష్ట్రాన్ని తాకుతున్నది. తాజాగా మధ్యప్రదేశ్లోని డాక్టర్‌ హరి సింగ్‌ గౌర్‌ విశ్వ విద్యాలయంలో హిజాబ్‌ ధరించిన ఓ విద్యార్థిని తరగతి గదిలో నమాజ్‌ చేస్తున్నట్టు హిందూ జాగరణ మంచ్‌ ఫిర్యాదు చేసింది. దీంతో ఆ విశ్వ విద్యాలయం ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించింది. వర్సిటీలో ముస్లిం విద్యార్థిని హిజాబ్‌ ధరించి నమాజ్‌ చేస్తున్న వీడియో ఈ వివాదానికి దారితీసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో హిందూ జాగరణ్‌ మంచ్‌ వర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌కు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశామని, మూడు రోజుల్లో నివేదిక అందుతుందని, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్‌ సంతోష్‌ సహగౌరా తెలిపారు.

ఇంట్లో, ప్రార్థనా మందిరాల్లోనే ఆరాధనలు చేసుకోవాలని, యూనివర్సిటీల్లో కాదని స్పష్టం చేశారు. సదరు విద్యార్థిని చాలా రోజుల నుంచి హిజాబ్‌ ధరిస్తూ వస్తోందని, శుక్రవారం కావడంతో క్లాస్‌రూంలోనే నమాజ్‌ చేసిందని హిందూ జాగరణ మంచ్‌ నేతలు తెలిపారు. వర్సిటీలో అధికారిక దుస్తుల కోడ్‌ లేదన్న రిజిస్ట్రార్‌.. తప్పనిసరిగా ఎథికల్‌ డ్రెస్సింగ్‌లో తరగతులకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement