టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా నేడు భారత్-ఆస్ట్రేలియా మద్య జరుగుతన్న హైవోల్టేజ్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. సెయింట్ లూసియా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు బ్యాటింగ్ లో చెలరేగుతోంది.
రెండో ఓవర్లోనే విరాట్ కోహ్లీ డకౌట్‌గా వెనుదిరగగా… కెప్టెన్ రోహిత్ శర్మ (14 బంతుత్లో 41 పరుగులతో నాటౌట్) సిక్సుల వర్షం కురిపిస్తున్నాడు. ఇక ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ శర్మ(41), రిషబ్ పంత్ (1) ఉన్నారు. కాగా, 4.1 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి భారత్ 43 పరుగులు బాదింది.
ఇక ఈ పోరులో విజయం సాధిస్తే టీమిండియా నెట్ రన్‌రేట్‌తో సంబంధం లేకుండా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి లేదంటే ఇంటిముఖం పట్టాల్సిందే.