దేశ వ్యాప్తంగా నీట్ -2024పరీక్షల ఫలితాలపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ కంపెన్సేటరీ మార్పుల వివాదంపై యూపీఎస్సీ మాజీ చైర్మన్ ఆధ్వర్యంలో నలుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ వేసినట్లుగా డీజీ సుబోధ్ కుమార్ సింగ్ ప్రకటించారు.
మార్కుల మంజూరీపై నెలకొన్న వివాదంపై కమిటీ విచారణ చేసి పరిష్కరిస్తుందని పేర్కోంది. కమిటీ వారం రోజుల్లో సిఫారసులతో నివేదిక ఇస్తుందని, 1500కిపైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కులను కమిటీ సమీక్షిస్తుందని తెలిపారు.
పేపర్ లిక్ కాలేదని, అవకతవకలేమి జరగలేదని స్పష్టం చేశారు. 67 మందికి ప్రధమ ర్యాంకు రావడంపై నిరసనలు వచ్చాయని, గ్రేస్ మార్కులు కలపడంతోనే అధిక మార్కులు వచ్చాయని పేర్కోన్నారు. దేశ వ్యాప్తంగా 24లక్షల మంది నీట్ పరీక్షలు రాశారు. ఫలితాలపై 1600మంది అభ్యర్థులు ఫిర్యాదు చేశారు.