పెద్దశంకరంపేట, (ప్రభన్యూస్): జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో అన్ని జాతీయ బ్యాంకుల కంటే బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ సదుపాయం కలదని పెద్దశంకరంపేట డిసిసిబి మెనేజర్ కిషన్‌నాయక్ తెలిపారు. కరెంటు అకౌంట్ గానీ ప్రతి ఒక్కరికి వీలైనంత తొందరగా చేయడం జరుగుతుందని అన్నరు. డిపాజిట్ సేకరణ మాసాన్ని ఈ నెల 17 నుండి వచ్చే నెల 16 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. బ్యాంకులో డిపాజిట్ సమయంలో సమస్యలు కాలపరిమితి పైన అన్ని రికవరింగ్ ఫిక్స్ డిపాజిట్‌పై, పాయింట్ పైన అదనపు వడ్డీ చెల్లించడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా మన బ్యాంకులో లాకర్ సౌకర్యం, గోల్డ్‌లోన్, మహిళా సంఘాలకు, గృహ నిర్మాణానికి రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తేనే కొత్త రుణ సౌకర్యం కలదు కాబట్టి ప్రతి ఖాతాదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు రికవరీ అధికారి రవీందర్, లక్ష్మీకాంతం, ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం ఛైర్మన్ సిద్ద సంజీవరెడ్డి, పిఏసిఎస్ పేట, అల్లాదుర్గం సీఈఓలు రవీందర్, శివాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..