Wednesday, November 20, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌.. మన ఊరు – మన బడిపై కీలక ఆదేశాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మన ఊరు – మన బడి టెండర్లపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి కోర్టు ఆదేశాలు వచ్చేంత వరకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయోద్దని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి షాక్‌ తగిలినట్లైంది. మన ఊరు-మన బడి టెండర్లపై విచారమ చేపట్టిన కోర్టు ఇరు పక్షాల వాదనలను విన్నది. ఈ టెండర్లను ఇటీవల ఎలగంట్‌ మెధడక్స్‌ సంస్థ దక్కించుకుంది. ఇది చట్ట విరుద్ధమంటూ కేంద్రీయ బండార్‌ జెనిత్‌ మెటప్లస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వీ3 ఎంటర్‌ ప్రైజెస్‌ లిమిటెడ్‌లు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి.

టెండర్‌ నిబంధనలలోని అన్ని అర్హతలు తమకు ఉన్నాయని కోర్టులో పిటిషనర్లు వాదించారు. తమకే టెండర్ల ప్రక్రియ దక్కాలని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం కోర్టు టెండర్ల ప్రక్రియను పూర్తి చేయోద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, టీఎస్‌డబ్ల్యూఐడీసీ చీఫ్‌ ఇంజనీర్‌, ఎలగంట్‌ మేథడాక్స్‌ సంస్థలను ప్రతివాదులను చేర్చి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణ ఈ నెల 11 తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement