Thursday, November 7, 2024

TGSPSC | వారికి కూడా రిజర్వేషన్ కల్పించాలి.. హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో ట్రాన్స్ జెండర్లకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు.. టీజీఎస్పీఎస్సీతో పాటు లేబర్, ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్లకు కీలక ఆదేశాలు చేసింది. ట్రాన్స్ జెండర్ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ ఎన్ రాజేశ్వర్ రావులతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత కుల ఆధారిత రిజర్వేషన్‌లతో పాటుగా థర్డ్ జెండర్ కేటగిరీ కింద ట్రాన్స్ జెండర్లకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియల్లో కూడా రిజర్వేషన్‌ కల్పించాలని సూచించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement