Thursday, November 21, 2024

ఎపిలో ఏక‌గ్రీవాలు – విచార‌ణ‌కు హైకోర్టు ఆదేశం..

అమరావతి: పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాల ఏకగ్రీవాలపై విచారణకు హైకోర్టు ఆదేశించింది. ఏకగ్రీవాలపై విచారణ జరపాలని ఎస్‌ఈసీకి కోర్టు ఆదేశించింది. రేపటిలోగా విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు కోరింది. చిత్తూరు జిల్లా పుంగనూరు, తంబళ్లపల్లెతోపాటు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో వైసీపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడుతున్నా నిలువరించడంలో ఎస్‌ఈసీ, జిల్లా కలెక్టర్‌ విఫలమయ్యారని పేర్కొంటూ పుంగనూరు ని యోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అనీషారెడ్డి, టీడీపీ మాజీ ఎ మ్మెల్యే శంకర్‌, న్యాయవాది పారా కిషోర్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయస్థానం విచారించింది. బలవంతపు ఏకగ్రీవాలు, నామినేషన్ల తిరస్కరణపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు ఎస్‌ఈసీ పరిగణలోకి తీసుకుని ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement