Tuesday, November 26, 2024

TG | మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టు నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నామినేషన్ సందర్భంగా కేటీఆర్ సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు ప్రచారం ఉందంటూ కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు.. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేటీఆర్ తోపాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సిరిసిల్ల రిటర్నింగ్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement