Tuesday, December 3, 2024

High Court | పుష్ప 2 విడుద‌ల‌కు లైన్ క్లియ‌ర్

అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమా రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని మంగళవారం ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పుష్ప 2 సినిమా టికెట్ ధరల పెంపు వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. బెనిఫిట్ షో పేరుతో 800 రూపాయలు వసూలు చేయడం అన్యాయమని, బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బును ఎక్కడికి మల్లిస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సతీష్‌ కోరారు.

దీనిని విచారించిన తెలగాణ హైకోర్టు చివరి నిమిషంలో సినిమా విడుదలను అడ్డుకోలేమంటూ పుష్ప 2 సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది. ఈ మేరకు విడుదల చేసుకునేందుకు మైత్రీ మూవీ మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది. అదే సమయంలో బెనిఫిట్‌ ద్వారా వచ్చే కలెక్షన్ల వివరాలను తమకు తెలియజేయాలని నిర్మాతలను ఆదేశించింది. బెనిఫిట్‌ షో వసూళ్ల పూర్తి వివరాలు రెండు వారాల్లో సమర్పించాలని మైత్రి మూవీస్ ను ఆదేశించింది. అలాగే టికెట్‌ ధరల పెంపు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం పరిశీలిస్తామని న్యాయస్థానం తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement