Wednesday, January 8, 2025

TG | కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు !

హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేస్‌లో అవకతవకలు జరిగాయని తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.

కేసు తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10:30 గంటలకు హైకోర్టు తీర్పును ప్రకటించనుంది. కాగా, తీర్పు వెలువడే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement