తెలంగాణలో గురుకుల టీజీటీ పోస్టుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా గురుకుల టీజీటీ పోస్టుల భర్తీ విషయంలో బీటెక్ అభ్యర్థలు అర్హత విషయంపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఈడీ చేసిన బిటెక్ విద్యార్థులు గురుకుల టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టం చేసింది.
మరో వైపు గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు అప్పీళ్ళను హైకోర్టు కొట్టి వేసింది. బీఈడీ చేసిన బిటెక్ అభ్యర్థులను టీజీటీ పోస్టుల్లోకి తీసుకోవాలని సంబంధిత అధికారులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో గురుకుల టీజీటీ పోస్టుల నియామకాలను చేపట్టాలని బోర్డును హైకోర్టు ఆదేశించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital