Thursday, November 21, 2024

అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌కు హైకోర్టు అనుమ‌తి

అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర‌కు రాష్ట్ర హైకోర్టు అనుమ‌తిచ్చింది. ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు ఈనెల 12 నుంచి అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహా పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అర్ధరాత్రి అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రతిని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతి రావుకు పంపించారు. అనుమతి నిరాకరణకు గల కారణాలను డీజీపీ తెలియజేశారు. గత ఏడాది కోర్టు అమరావతి నుంచి తిరుపతి దేవస్థానం వరకు నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన షరతును ఉల్లంఘించ డంతో పాటు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారని వివరించారు. పాదయాత్ర సాగిన వివిధ జిల్లాలో 71 క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆయా జిల్లాల పోలీసు అధికారుల సూచనల మేరకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అమ‌రావ‌తి రైతులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డంతో హైకోర్టు పాద‌యాత్ర‌కు అనుమ‌తిచ్చింది. ఈ పాద‌యాత్ర ఈనెల 12వ తేదీ నుంచి న‌వంబ‌ర్ 11వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అమరావతి నుంచి అరసవల్లి వరకు ఈ పాద‌యాత్ర నిర్వ‌హించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement