Saturday, November 23, 2024

TG | మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅల‌ర్ట్ !

హైద‌రాబాద్ లో గ‌త వారంరోజులుగా కురుస్తున్న కుండ‌పోత వాత కార‌ణంగా జంట నగరాల్లోని జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్ సాగర్ కు 1800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, హిమాయత్ సాగర్ కు 1400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు వెల్లడించారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వరద నీరు ఇంకా పెరిగితే ఇబ్బంది అవుతుందని, గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.

ఉస్మాన్ సాగర్ లోని 2 గేట్లు, హిమాయత్ సాగర్ లోని ఒక గేటును ఎత్తి దిగువున ఉన్న మూసీ నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ క్ర‌మంలో జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రెండు రోజుల్లోగా తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement