Saturday, November 23, 2024

ఏపీలో హై అలర్ట్‌.. పోలీసు వలయంలో రైల్వేస్టేషన్లు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో హై అలర్ట్‌ కొనసాగుతోంది.. శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నప్పటికీ ఎక్కడా కూడా అసాంఘిక శక్తులు విరుచుకుపడకుండా నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది. అగ్నిపధ్‌ పధకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా దేశంలో గత రెండురోజులుగా ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమారు దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఈ తరహా పరిస్ధితి నెలకొంది. దీనిలో భాగంగా తెలంగాణా రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం జరిగిన విధ్వంసం, హింస, కాల్పులు తదితర ఘటనల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఎట్టి పరిస్ధి తుల్లో పడకూడదని ప్రభుత్వం యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్ధితులపై ప్రభుత్వం సమీక్షిస్తున్నట్లు ఆయా వర్గాల సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాజా పరిస్ధితుల పై డీజీపీ, ఇతర ప్రభుత్వ పెద్దల నుంచి సమాచారం తెలుసుకుంటూ తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలు క్షేత్ర స్ధాయిలో పర్యటిస్తూ బందోబస్తుపై సమీక్షిస్తున్నారు. అదేవిధంగా ప్రధానంగా రాష్ట్రంలోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లను పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ అక్కడి ప్రధాన రైల్వే స్టేషన్లన్నీ పోలీసు వలయంలోకి వెళ్ళిపోయాయి. ఇదే సమయంలో నిజమైన ప్రయాణీకులకు ఏవిధమైన ఆటకంగాలు కలుకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏపీలో ప్రధానమైన విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు తదితర రైల్వేస్టేషన్ల వద్ద అదనపు పోలీసు బలగాలు మోహరించాయి. ఇక విశాఖ పట్నం రైల్వేస్టేషన్‌ వద్ద పోలీసు కమిషనర్‌ శ్రీకాం త్‌ స్వయంగా పరిశీలించి భద్రతా చర్యలకు సంబంధించి బలగాలకు దిశానిర్ధేశం చేశారు. అయితే ఆందోళనకారుల తాకిడి ఉంటుందన్న నిఘా వర్గాల సమాచారం మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖ రై ల్వేస్టేషన్‌ను కొన్ని గంటలపాటు మూసివేశారు. ప్రతి నిముషం అక్కడి పరిసి ్ధతిని అంచనా వేసుకుంటూ తిరిగి మరలా స్టేషన్‌ తెరిచి సేవలను పునరుద్ధరించారు. 200కుపైగా సిఆర్‌పిఎఫ్‌ దళాలు విశాఖపట్నంలో అదనపుంగా మోహరించాయి. కాగా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అలజడి రేగింది. పలుచోట్ల ఆందోళనకారులు హద్దు దాటే ప్రయత్నం చేయడంతో ఎక్కడికక్కడ పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. ఇక వామపక్ష నేతలను ముందుగానే శుక్రవారం అర్ధరాత్రి నుంచి విజయవాడలో అదుపులోకి తీసుకుని శనివారం కూడా తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. మరోవైపు గుంటూరులో అలజడి రేగింది. రైల్వేస్టేషన్‌ వైపు ఆర్మీ అభ్యర్ధులు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. దీంతో కొత్తపేట పోలీసే ్టషన్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు రైల్వే స్టేషన్‌ వద్ద అదనపు బలగాలతో కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేసిన పోలీసులు 20 మంది ఆర్మీ అభ్యర్ధులను అరెస్టు చేశారు.

ఇక ప్రధానమై విజయవాడ రైల్వేస్టేషన్‌ వద్ద అసాధారణ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు కమిషనర్‌ కాంతి రానా టాటా స్వయంగా పలుమార్లు స్టేషన్‌ వద్దకు వచ్చి పరిస్ధితి సమీక్షించారు. పరిసర ప్రాంతాలు, రైల్వేట్రాక్‌ల వెంబడి అదనపు బలగాలు గస్తీ నిర్వహించాయి. విజయవాడ స్టే షన్‌ వద్ద అదనంగా 300 మంది పోలీసులు మోహరించి టిక్కెట్‌ ఉంటేనే స్టేషన్‌లోపలికి అనుమతించారు. అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తుల వద్ద అదనపు బందోబస్తు, కట్టుదిట్ట భద్రతా చర్యలు చేపట్టారు. నంధ్యాల, అనకాపల్లి రైల్వే స్టేషన్లలో ఎస్పీలు స్వయంగా బందోబస్తు విధులు నిర్వహించారు. అల్లర్లకు పాల్పడే ఆస్కారమున్న వ్యక్తులు, రౌడీషీటర్లను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపధ్‌ పధకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కడపలో విద్యార్ధి యువజన సంఘాలు కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించగా పోలీసు బలగాలు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నాయి. మరోవైపు ఎస్పీ కడప రైల్వేస్టేషన్‌ను పరి శీలించారు. తిరుపతిలో జిల్లా వ్యాప్తంగా బందోబస్తు ఏర్పాటు చేసిన ఎస్పీ పరమేశ్వరరెడ్డి ప్రత్యేక బలగాలతో పటిష్ట భ్రదతా చర్యలు చేపట్టారు. బాపట్ల ఎస్పీ జిల్లాలో పటిష్ట చర్యలు తీసుకోవడంతోపాటు ప్రధానంగా వాట్సాప్‌ సమాచారంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానితుల కదలికలపై దృష్టి సారించారు. మరోవైపు డీజీపీ కెవి రాజేంద్రనాధ్‌ రెడ్డి జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో నిత్యం సమీక్ష జరుపుతూ శాంతి భ్రదతలపై ఆరా తీస్తున్నారు. ప్రజా జీవనానికి భగం కలుగ కుండానే మరోవైపు అసాంఘిక శ క్తులు రెచ్చిపోకుండా కట్టడి చేసే చర్యలపై సీరియస్‌గా ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ఏపీలో దొరికిన సికింద్రాబాద్‌ విధ్వంసం సూత్రధారీ

ఇదిలావుండగా.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు సూత్రధారిగా అనుమానిస్తున్న వ్యక్తిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సంఘటన వెనుక కుట్ర కోణం తేల్చాసిన పోలీసులు సాయి డిఫెన్స్‌ అకాడమీ డైరెక్టర్‌ ఆవుల సుబ్బారావును ప్రకాశం జిల్లా కంబంలో అదుపులోకి తీసుకున్న నరసరావుపేట పోలీసులు సికింద్రాబాద్‌ తరలించారు. హింసాఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 15ఏళ్ల క్రితం ఖమ్మం నుంచి నరసరావుపేటకు వలస వచ్చిన సుబ్బారావు ఆర్మీలో పని చేసి వచ్చిన మీదట అకాడమీ నెలకొలి ్ప యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఈక్రమంలో ఖమ్మం, నరసరావుపేట, హైదరాబాద్‌ తదితర చోట్ల అకాడమీలు నిర్వహిస్తున్న క్రమంలో దేశ వ్యాప్తంగా ఎక్కడ ఆర్మీ ర్యాలీ జరిగిన తన విద్యార్ధులనే పంపేవారని తెలుస్తోంది. ఈక్రమంలో ఆర్మీ శిక్షణకు వచ్చే యువతను చాకచక్యంగా నడిపించడంలో దిట్ట అయిన సుబ్బారావు వ్యూహం ప్రకారమే హింసాత్మక ఘటన చోటు చేసుకుందని సాయి అకాడమీకి చెందిన సుమారు 200 మందికి పైగా యువత ఇందులో పాల్గొన్నారని, వాట్సాప్‌ ద్వారా సమాచారం, సూచనలు షేర్‌ చేయబడ్డాయని, కేంద్ర ప్రభుత్వ అగ్నిపధ్‌ను వ్యతిరేకించే క్రమంలో విధ్వంసాలకు పాల్పడిన కుట్ర కోణంలో సుబ్బారావు పాత్రధారిగా అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సికింద్రాబాద్‌ తరలించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement