ప్రభాన్యూస్ : జిల్లాలో దొంగతనాలకు పాల్పడే గ్యాంగుల కదలికల పై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ మలికగర్గ్ పోలీసు అధికారులను ఆదేశించారు. నేరాలకు పాల్పడే వివిధ గ్యాంగులు రాష్ట్రంలోకి ప్రవేశించిందన్న సమాచారం నేపథ్యంలో ఎస్పీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా హైవేలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, గ్రామ శివారులు, ఫ్లై ఓవర్ల పక్కన నివసించే వారిలో ఎంత మంది అనుమానితుల వ్యక్తులను, కొత్త వ్యక్తులను గుర్తించారో అడిగి తెలుసుకున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో సుమారుగా 1000 మంది కొత్త వ్యక్తులను గుర్తించి, వారి పూర్తి వివరాలు నాన్‌లోకల్ యాప్‌లో పొందుపరిచామని అధికారులు ఎస్పీకి తెలియజేశారు.
గ్రామ, పట్టణ శివారు ప్రాంతాల్లో ఉండే అపార్టుమెంట్లు, ఇళ్లను లక్ష్యంగా నేరాలకు పాల్పడే చెడ్డీగ్యాంగ్ , పార్థీ గ్యాంగ్, భవార్య, ఇరానీ గ్యాంగులు గురించి వారి ఉనికి, వేషాధారణ, నివసించే ప్రాంతాలు, దొంగతనాలు చేసే తీరు, ఇతర విషయాల పై నిపుణుల ద్వారా పోలీసు అధికారులకు, మహిళా పోలీసులకు పూర్తి అవగాహన కల్పించారు. సమావేశంలో ఓఎస్‌డి చౌడేశ్వరి, ఎసీ ్బ డిఎస్పీ మరియదాసు, డిసిఆర్‌బి సీఐ బాల మురళీకృష్ణ, సిఐ మొయిన్, ఎస్బీ సీఐ-2 శ్రీకాంత్, కమ్యూనికేషన్ సీఐ వెంకయ్య, ఐటి కోర్ ఎస్సై అజయ్ కుమార్ పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital