Friday, November 22, 2024

శైలజ టీచర్ కు హీరోయిన్స్ సపోర్ట్

కేరళ మంత్రివర్గంలో కే కే శైలజ కు చోటు కల్పించకపోవడం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిఫా వైరస్ సహా కరోనా మొదటి వేవ్ లో వాటి వ్యాప్తిని అడ్డుకట్టవేసి అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న శైలజకు మంత్రివర్గంలో చోటు ఇవ్వని నేపథ్యంలో సామాన్యుల తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు అండగా నిలుస్తున్నారు. మలయాళ నటి పార్వతి తో పాటు అనుపమ పరమేశ్వరన్, మాళవికా మోహనన్ ట్విట్టర్ వేదికగా సీఎం పినరయి విజయన్ ప్రశ్నించారు.

#Bringbackshailajateacher , #Bringourteacherback అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో ఆమె ఖచ్చితంగా ఉండాల్సిన వ్యక్తి అని శైలజకు అన్యాయం జరిగిందని…రాష్ట్ర ప్రజలకు అలాంటి ఉత్తమమైన నేత అవసరమని అన్నారు. ఆమె అరవై వేల మెజారిటీతో విజయం సాధించారని కేరళలో 140 స్థానాలలో ఇదే అత్యధికమని ఆమె కోసం పోరాడవలసి వస్తుందని వాపోయారు. ఇక మాళవిక మోహనన్ స్పందిస్తూ విపత్కర సమయంలో ఉత్తమ ఆరోగ్య శాఖ మంత్రికి మంత్రివర్గంలో చోటు కల్పించలేదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు పినరయి విజయన్ కు ఏమైంది అని ప్రశ్నించారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ కేకే శైలజ ఫోటోను పోస్ట్ చేస్తూ మద్దతుగా నిలిచారు. Bringbackshailajateacher , #Bringourteacherback హ్యాష్ ట్యాగ్ లను పోస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement