Saturday, November 23, 2024

నాన్న‌కు ప్రేమ‌తో – ర‌కుల్ ప్రీత్ సింగ్ పోస్ట్

త‌న తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్. ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ ని పోస్ట్ చేసింది.
కుటుంబంతో పాటు మాల్దీవుల్లో ఉంది ఈ ఢిల్లీ బ్యూటీ.. పేరెంట్స్ తో సరదగా గడుపుతోంది. తన తండ్రి కుల్విందర్ సింగ్ పుట్టిన రోజు సందర్భంగా రకుల్ స్పెషల్ గా విష్ చేసింది. తన తండ్రిపై ఉన్న ప్రేమను మొత్తం అభిమానులతో సోషల్ మీడియాలో వర్ణించింది. ఈ మేరకు తండ్రి కుల్విందర్ సింగ్, తల్లి రాజేందర్ కౌర్ తో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసింది రకుల్. ఫొటోలు షేర్ చేస్తూ నోట్ కూడా రాసింది. తన జీవితంలో తన తండ్రి ఎలాంటి పాత్ర పోషించాడో చెప్పుకొచ్చింది. నాకు స్ఫూర్తి, నా రోల్ మోడల్, నా బలం మీరే నాన్న.. నేను ప్రతి రోజు మీకోసం ఎదురు చూస్తున్నాను.. మీరు అన్ని విషయాల్లో నాకు మార్గనిర్దేశం చేయడం నా అదృష్టం.. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను. ఈ సంవత్సరం మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎల్లప్పుడూ గర్వించేలా చేస్తానని హామీనిస్తున్నాన‌ని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement