ఆయన మంచి నటుడే కాదు అంతకుమించి సేవాకర్త కూడా. పలు సేవా కార్యక్రమాలు చేసి అందరి మనసులని కొల్లగొట్టారు. ఆయనే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్. రీసెంట్ గా హార్ట్ ఎటాక్ తో మరణించిన విషయం తెలిసిందే. ఆయన అకాలమరణంతో పునీత్ నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో పునీత్ స్ఫూర్తితో కొందరు సినిమా తారలు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల పునీత్ చదివిస్తోన్న 1,800 మంది పిల్లల బాధ్యతలను హీరో విశాల్ తీసుకున్నాడు..
కాగా కన్నడ నటి ప్రణీతా సుభాష్ ఒకరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుచేయనుంది. బెంగళూరు నగరంలోని అంబేడ్కర్ భవనంలో బుధవారం నవంబర్3 న ఈ మెడికల్ క్యాంపు జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగే ఈ వైద్య శిబిరంలో ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చనని ఆమె వెల్లడించింది. ‘అప్పూ సర్…చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ అవసరమైన వారందరికీ సాయం చేశారు. వారి విద్య, వైద్య ఖర్చులన్నీ భరించారు. ఇవేకాక మీరు ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి’ అని మెడికల్ క్యాంప్ వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రణీత. ఇలా నటీనటులు సామాజిక సేవ చేసేందుకు ముందుకు రావడం విశేషం.