నేడు తన 34వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి రౌడీహీరోగా గుర్తింపు పొందిన ఈ హీరో సినీ కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. విజయ్ దేవరకొండ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై.. ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. సినిమా చివరిలో చనిపోయి అందరి చేత కంటతడి పెట్టించిన ఈ యువ హీరో మొదటి హిట్ అందుకోవడమే కాదు.. ఈ సినిమా నేషనల్ ఫిలిం అవార్డును కూడా సొంతం చేసుకుంది. బర్త్ డే సందర్భంగా విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ ఇచ్చాడు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు డబ్బుల కోసం చిన్న చిన్న పనులు చేసిన ఆయన చిన్న చిన్న ప్రదర్శనలు ఇస్తూ పదివేల రూపాయల కోసం ఎంతో కష్టపడినట్లు గుర్తు చేసుకున్నాడు. అలాగే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఒక మ్యూజిక్ ఆల్బమ్ లో కూడా నటించారట. అవసరం తీరడం కోసం ఏ పని అయినా ఏ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఓకే అని తనకు సరైన అవకాశం వచ్చేవరకు వేచి చూశాడు విజయ్ దేవరకొండ. అయితే ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు తనకు ఉత్తేజాన్ని ఇవ్వదని ఎందుకంటే తాను చేస్తున్న పనికి తగిన పారితోషకం ఇస్తున్నారని.. తనకు తన అర్హత ఏమిటో తెలుసని చెబుతున్నాడు..
అంతేకాదు తనకు డబ్బులు ఇస్తేనే పనిచేస్తానని అదే సమయంలో తనకు నచ్చని పనికి ఎంత డబ్బులు ఇచ్చినా చేయను అంటూ తెలిపారు విజయ్ దేవరకొండ. ఒకప్పుడు డబ్బు కోసం నానా తిప్పలు పడిన ఈయన ఇప్పుడు ఆ డబ్బుల కుప్పలుగా పోసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంతతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరొకపక్క తన 12వ చిత్రాన్ని శ్రీ లీలతో తెరకెక్కిస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు హీరోయిన్ సమంత కూడా విజయ్‌కి బర్త్ డే విషెస్ చెప్పింది. విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేస్తూ విషెస్ పోస్ట్ పెట్టింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ విషెస్ తెలియజేయడం విశేషం. ఇదిలా ఉంటే ఇందులో సమంత పెట్టిన కామెంట్ ఇప్పుడు రచ్చ లేపుతుంది. ఈ సందర్భంగా సమంత చెబుతూ, నా మంచి స్నేహితుడు, నా ఫేవరేజ్ కోస్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే సీడీపీని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. నీ సక్సెస్ కోసం నేను ప్రార్థిస్తున్నా, విషెస్ తెలియజేస్తున్న. ఎందుకంటే నువ్వు నిజంగా అన్నింటిలో బెస్ట్ పొందేందుకు అర్హత కలిగి ఉన్నావు అని పేర్కొంది సమంత. ఆమె చేసిన ఈ పోస్ట్ నెట్టిం చక్కర్లు కొడుతూ రచ్చ చేస్తుంది.