బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తొలిసారిగా మరాఠీ మూవీ వేద్ లో నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తెలుగు మూవీ మజిలీకి రీమేక్ . జెనీలియా హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం తర్వాత భార్యాభర్తలు కలిసి నటిస్తున్నారు. డిసెంబర్ 30న భారీ స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలు పెట్టారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగా..ఓ కాలేజీ క్యాంపస్ కు వెళ్లారు చిత్రయూనిట్. ఆ సమయంలో ఓ యువతి స్టేజ్ పైకి వచ్చి రితేష్ తో కలిసి డాన్స్ చేయాలనీ ఉందని కోరింది. వెంటనే రితేష్ ఆమె తో కలిసి డాన్స్ చేశాడు. దాంతో ఆమె ఆనందం ఆపుకోలేక బోరున ఏడుస్తూ.. అతడి కాళ్లు పట్టుకుంది. వెంటనే రితేష్ ఆమెను పైకి లేపి ఆమె కాళ్లు పట్టుకున్నాడు. రితేష్ ప్రవర్తనకు అక్కడ ఉన్నవారంతా ఫిదా అయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -