బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. ఓ మేగజీన్ కోసం న్యూడ్ ఫోటో షూట్ చేశారు. ఒంటిపై నూలిపోగు కూడా లేకుండా ఫోటోలకు పోజులిచ్చారు. రణ్ వీర్ సింగ్ పేపర్ మేగజీన్ కోసం ఇలా న్యూడ్ పోజులిచ్చారు. ఈ సందర్భంగా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు రణ్ వీర్ సింగ్. నేను శరీరకంగా నగ్నంగా ఉండటం చాలా సులభం. కానీ నా కొన్ని ప్రదర్శనలలో నేను నగ్నంగా ఉన్నాను.
మీరు నా ఫకింగ్ ఆత్మని చూడొచ్చు. అదే అసలైన నగ్నత్వం. నేను వెయ్యి మంది ముందు కూడా నగ్నంగా ఉండగలను. ఆ విషయంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు అని పేర్కొన్నారు రణ్వీర్. ప్రస్తుతం ఆయన పోస్ట్, ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. రణ్ వీర్ సింగ్ డేర్నెస్కి అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చూడ్డానికి నగ్నంగా కనిపించినా, తనలో ఎలాంటి నగ్నత్వం లేదని అసలైన ఆత్మని చూపించావని, గొప్ప పని చేశావని ప్రశంసలు కురిపిస్తున్నారు. వరుసగా ఆయన ఫోటోలను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు నెట్టింట రణ్ వీర్ సింగ్ హల్చల్ చేస్తున్నారు. అయితే దీన్ని భార్య దీపికా పదుకొనె ఎలా ఫేస్ చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.