Wednesday, November 20, 2024

హిట్ అయితే గుడ్ ల‌క్ అంటారు లేదంటేః నితిన్

హీరో నితిన్‌ నిత్యం బిజీగా ఉండే నటుడు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన బిజీగా ఉంటారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. గత ఏడాది భీష్మతో తన ఖాతాలో సక్సెస్‌ వేసుకున్నారు. ఈ ఏడాది లో చెక్‌ సినిమాతో వస్తున్నారు. శుక్రవారం విడుదలవుతున్న ఈ చిత్రం గురించి, తన పాత్ర గురించి నితిన్‌ చెప్పుకొచ్చారు.
చెక్‌ సినిమాకు ఎలా ప్లాన్‌ జరిగింది ?
భీష్మ, చెక్‌ రెండు సినిమాలు ఒకేసారి ఒప్పుకు న్నాను. లాక్‌ డౌన్‌ వల్ల భీష్మ ముందు వచ్చింది చెక్‌ కొంత ఆలస్యం అయింది.
యేలేటి గారితో సినిమా చెయ్యాలని ఎప్పుడు అనిపించింది?
వరుస ఫ్లాప్‌ల తర్వాత ఒక కమర్షియల్‌ సిని మా, మరొకటి ప్రయోగాత్మక చిత్రం చేయాలని ప్లాన్‌ చేసుకున్నాను. ఆ సయమంలో యేలేటి సినిమా అవకాశం వచ్చింది. అంగీకరించాను.
స్కిప్ట్ర్‌ విన్నాక ఎలా అనిపించింది?
తొలుత నాకు చెప్పింది ఈ స్కిప్ట్ర్‌ కాదు వేరేది చెప్పారు. అది బాగానే అనిపించింది రెండు నెలలు సమయం తీసుకున్నారు. ఆ తర్వాత దానిపై అంత కాన్ఫిడెన్స్‌ గా తనకి కూడా అనిపించలేదు. అప్పుడు ఈ లైన్‌ చెప్తే వెంటనే ఓకె చేసేసా. ఎందుకంటే రొటీ-న్‌ రొమాన్స్‌ ఉండదు, ఒకటే సాంగ్‌ మొత్తం జైల్‌ బ్యాక్‌ డ్రాప్‌ లోనే ఉంటు-ంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ అయితే హైలైట్‌ అందుకే చాలా ఎ్జగటింగ్‌ గా అనిపించింది.
ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ప్రిపేర్‌ అయ్యారా?
అదేం లేదు. యేలేటి గారు ఏం చెప్తే దాన్నే ఫాలో అయ్యాను. ఇంతకు ముందు నేను నటిం చిన సినిమాల లొకేషన్స్‌ లో సరదాగా ఉండేవా డిని, కానీ ఈ సినిమా సెట్స్‌ లో చాలా కామ్‌గా ఉండే వాడిని.
ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారా. .?
లేదు లేదు ఇందులో ఎలాంటి డ్యూయల్‌ రోల్స్‌ లేవు సింగిల్‌ రోల్‌ మాత్రమే. ఆ డిఫరెంట్‌ లూకా అంతా జస్ట్‌ ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో మాత్రమే ఉంటుది అంతే.
మీ పెళ్లయ్యాక వస్తున్న ఫస్ట్‌ సినిమా ఇది మీరు మీ భార్య ఎంత ఎగ్జైటెడ్‌ గా ఉన్నారు?
ఎ్జఎగ్జైట్మంట్‌ ఏం అని కాదు కానీ హిట్‌ అయితే గుడ్‌ లక్‌ అంటారు లేదంటే బ్యాడ్‌ లక్‌ అంటారు అంతే. కానీ సినిమా టీజర్ ,టైలర్స్‌ మాత్రం నా భార్యకి బాగా నచ్చాయి.
రకుల్‌ ప్రీత్‌, ప్రియా ప్రకాష్‌ రోల్స్‌ కోసం ఏమన్నా చెప్పండి?
రకుల్‌ లాయర్‌ పాత్రలో చాలా బాగా చేసిం ది. ఇక ప్రియాకి ఇది తెలుగులో తొలి సినిమా అ యినా బాగా చేసింది సినిమాలో ఎక్కువగా ఉండ దు కానీ ఫ్లాష్‌ బ్యాక్‌ లో మాత్రమే ఉంటుది.
పవర్‌ పేట సినిమా కోసం చెప్పండి?
నా మొత్తం కెరీర్‌ లోనే అది ఒక ఛాలెంజింగ్‌ సినిమా. మొత్తం మూడు డిఫరెంట్‌ లుక్స్‌ లో కనిపిస్తా 20 ఏళ్ళు ఒకటి 40, 60 ఏళ్ల
వయసు రోల్స్‌ లో కనిపిస్తా. దానికి ఆ మేకప్‌ కు చాలా సమయం పడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement