Thursday, November 21, 2024

ఈ-పాస్ లేకుండా బయటకు వచ్చిన హీరో నిఖిల్.. అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీసులు కఠినంగా లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి వస్తే వాహనాలు సీజ్ చేస్తున్నారు. అత్యవసరం ఉంటే ఈ-పాస్ తీసుకుని బయటకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్‌.. ఓ కోవిడ్‌ బాధితుడికి మందులు అందించేందుకు ఆసుపత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిఖిల్‌ ఓ ట్వీట్‌ చేశాడు.

కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్‌ నుంచి కిమ్స్‌ మినిస్టర్స్‌ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో పోలీసులు తన కారుని ఆపేసినట్లు తెలిపాడు. బాధితుడి వివరాలు, వైద్యుడి రాసిన మందుల చీటి చూపించినా పోలీసులు తనను అనుమతించలేదన్నాడు. ఈ-పాస్‌ ఉండాల్సిందే అని స్పష్టం చేశారని పేర్కొన్నాడు. అప్పటికీ తాను తొమ్మిదిసార్లు ప్రయత్నించినా సర్వర్లు డౌన్‌ కావడం వల్ల ఈ పాస్ దొరకలేదని వివరించాడు. దాంతో మెడికల్‌ ఎమర్జెన్సీ అని చెబితే అనుమతి ఇస్తారని భావించి.. రోడ్డు మీదకు వచ్చినట్లు ట్వీట్‌లో పేర్కొన్నాడు. కాగా నిఖిల్‌ ట్వీట్‌పై స్పందించిన హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ విభాగం.. ‘డియర్‌ సర్‌, మీ లొకేషన్‌ ఒక్కసారి మాకు పంపించండి. స్థానిక అధికారులతో మాట్లాడి మీ సమస్యను తీరుస్తాం’ అని బదులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement