Saturday, November 23, 2024

మార్చిలో హీరో ఈవీ స్కూటర్‌ లాంచ్‌

భవిష్యత్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలదే కావడంతో అన్ని ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి సారిస్తున్నాయి. ఈక్రమంలో హీరో మోటోకార్ప్‌ తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను మార్చినెలలో మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్విచక్రవాహనాల రంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు ప్రభావం చూపిస్తాయని హీరో మోటోకార్ప్‌ కంపెనీ అంచనా వేసింది. కాగా డిసెంబర్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ 12.92లక్షల వాహనాలను విక్రయించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో చేసిన ప్రకటనల కారణంగా ప్రైవేట్‌రంగంలో పెట్టుబడులు పెరుగుతాయని హీరో మోటోకార్ప్‌ భావిస్తోంది.

ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్‌ కంపెనీ సీఎఫ్‌ఓ నిరంజన్‌గుప్తా మాట్లాడుతూ కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అన్ని రంగాలు కోలుకుంటున్నాయన్నారు. పెట్టుబడుల వ్యయం గత బడ్జెట్‌తో పోలిస్తే 35శాతం పెరుగుదల ఉంది. ఈ ఏడాది మార్చిలో తమ కంపెనీ తొలి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో విడుదల కానుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement