Saturday, November 23, 2024

విద్యుత్‌ వాహన రంగంలోకి హీరో వెూటో.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎగుమ‌తికి ప్లాన్‌

ప్రస్తుతం టూ వీల‌ర్‌ రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న హీరో మోటో కార్పోరేషన్‌ ఎలక్ట్రికల్‌ ద్విచక్ర వాహన రంగంలోకి అడుగుపె ట్టనుంది. ఈ రంగంలో కూడా కంపెనీ అగ్రగామిగా ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు కంపెనీ ఛైర్మన్‌, సీఈవో పవన్‌ ముంజల్‌ తెలిపారు. కంపెనీ వార్షిక జనరల్‌ బాడీ సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రికల్‌ టూ వీలర్స్‌ను ఎగుమతి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం హీరో మోటో కార్ప్‌ టూ వీలర్స్‌ ఉత్పత్తిలో 100 మిలియన్‌ యూనిట్ల మైలురాయిని అందుకుంది. కంపెనీ 1984లో ప్రారంభమైంది. కంపెనీ మొదటిసారి ఒక మిలియన్‌ ద్విచక్రవాహనాల ఉత్పత్తిని 1994లో సాధించింది. 2013లో 50 మిలియన్‌ వాహనాలను, 2017లో 75 మిలియన్‌ వాహనాల ఉత్పత్తిని కంపెనీ సాధించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement