Saturday, November 23, 2024

మంచు మ‌నోజ్ రెండో పెళ్లిపై స్పందించిన మోహ‌న్ బాబు

న‌టుడు.. మోహ‌న్ బాబు రెండో కుమారుడు మంచు మ‌నోజ్ రెండో పెళ్లి గురించి మాట్లాడారు. మనోజ్ త‌న దగ్గరికి వచ్చి, డాడీ .. ఇదీ పరిస్థితి .. చేసుకోవాలని ఉంది అన్నాడు. ఆలోచించారా అన్నాను .. లేదు డాడీ నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అన్నాడు. అయితే అలాగే కానీ .. బెస్ట్ ఆఫ్ లక్ అన్నాను .. కాదని ఎందుకు అంటాను.. ఈ విషయంలో ఎవరో ఏదో రాశారనీ .. ఏదో అనుకుంటున్నారని ఆలోచించడం నాకు అలవాటు లేదు. వాడేం అనుకుంటున్నాడో .. వీడేం అనుకుంటున్నాడో అని పట్టించుకుంటూ కూర్చుంటే నన్ను నేను మరిచిపోతాను. ఏనుగు వెళుతుంటే కుక్కలెన్నో మొరుగుతూ ఉంటాయి .. మొరగనీ. వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు .. సుఖంగా ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమించుకున్నారు.. వంటి విషయాల్లోకి డీప్ గా వెళ్లొద్దు. నేను హ్యాపీగా ఉన్నాను కనుకనే పెళ్లికి వెళ్లానని చెప్పారు మోహ‌న్ బాబు.

Advertisement

తాజా వార్తలు

Advertisement