తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని హాస్పటల్ లో చేరారు విశ్వ నటుడు కమల్ హాసన్. చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. తీవ్రమైన జ్వరంతో పాటు శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది రావటంతో కమల్ హాసన్ హాస్పిటల్లో చేరారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయ్యుంటాయని, అందుకనే ఆయనకు శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు వచ్చాయి. రీసెంట్‌గానే బంధు మిత్రులు సినీ ప్రముఖులు, సన్నిహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. బుధవారం హైదరాబాద్ వచ్చిన కమల్ హాసన్ ఆయన కళా తపస్వి కె.విశ్వనాథ్‌ని కలిశారు.
వారిద్దరూ ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్ హాస్పిటల్లో చేరారనే విషయం తెలియగానే ఆయన ఫ్యాన్స్ తమ అభిమాన నాయకుడికి ఏమైందోనని టెన్షన్ పడుతున్నారు. సినిమా అంటే ఇష్టపడే వారికి కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మెప్పిస్తూ వచ్చారు. నటుడిగానే కాకుండా నిర్మాతగా అభిరుచిని చాటుకున్నారు. దర్శకుడిగానూ ప్రయోగాత్మక చిత్రాలు చేసి మన్ననలు పొందారు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ రియాలిటీ షోను తమిళంలో హోస్ట్ చేస్తున్నారు. అలాగే శంకర్‌తో కలిసి ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.