టాలీవుడ్ నుంచి వచ్చిన పలు ఎవర్ గ్రీన్ హిట్స్ లో యూత్ ని బాగా ఆకట్టుకున్న ఎంటర్టైనర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది అండర్ రేటెడ్ సూపర్ హిట్ మూవీ “ఈ నగరానికి ఏమైంది”. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ అయ్యింది.
దీంతో అప్పుడు థియేట్రికల్ రిలీజ్ మిస్ అయ్యిన వారు అంతా ఈ సినిమాని మళ్లీ థియేటర్లలో చూడాలని తెగ ఆశ పడుతున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ కావాలని కోరుకుతున్నారు. దీంతో అప్పట్లోనే డైరెక్టర్ రీ రిలీజ్ ని కన్ఫర్మ్ చేసాడు. లేటెస్ట్ గా మరో సారి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి ఈ మూవీ రీ రిలీజ్ అతి త్వరలోనే ఉంటుంది అని టీజ్ చేస్తూ హింట్ ఇచ్చాడు.
అంతే కాకుండా విశ్వక్ సేన్ కూడా ‘డేట్ కావాల’ అంటూ ఓ స్టోరీ పోస్ట్ చేశాడు. ఇక దాంతో పాటు కొద్ది సేపటి క్రితం.. మోస్ట్ అవైటెడ్ సినిమా రీ-రిలీజ్ డేట్ ని రేపు అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించాడు విశ్వక్ సేన్. దీంతో ఈ మూవీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.