పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దాంతో పలు బ్రాండ్ లకి అంబాసిడర్ గా బన్నీని ఎంచుకుంటున్నారు. తాజాగా కోక కోలా బ్రాండ్ అంబాసర్ గా ఎంపికయ్యారు. దీంతో ఆయనపై ఓ యాడ్ షూట్ చేశారు. ఈ వీడియోలో బన్నీ మెస్మరైజింగ్ స్టెప్స్ తో ఆకట్టుకున్నారు. కాగా బన్నీ నటించిన కోక కోలా యాడ్ వీడియో రికార్డ్ వ్యూస్ రాబట్టింది. ట్విట్టర్ లో బన్నీ కోక కోలా యాడ్ కి 20 మిలియన్ వ్యూస్ దక్కాయి. 7 రోజుల్లో బన్నీ ఈ ఫీట్ సాధించాడు. ఇక పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ అరడజనుకు పైగా సంస్థలకు బ్రాండ్ అంబాసర్ గా ఉన్నారు. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 షూట్ కి సిద్ధమవుతున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement