Monday, October 7, 2024

Heritage Week – అధికారిక ఉత్సవంగా బతుకమ్మ.. గుర్తించిన అమెరికా ..

హైదరాబాద్ : తెలంగాణ సాంసృతిక వైభవాన్ని చాటిచెప్పే బతుకమ్మ పండుగ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. తాజాగా అమెరికాలోని పలు రాష్ట్రాలు బతుకమ్మ పండుగకు అధికారిక గుర్తింపునిచ్చాయి. ఇప్పటికే పలు దేశాల్లో తెలంగాణ ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ ఆడుతున్న విషయం విధితమే. ప్రస్తుతం ప్రతిష్టాత్మక వైట్‌ హౌజ్‌, ఆస్ట్రేలియా ఒపేరా హౌజ్‌, లండన్‌ బ్రిడ్జ్‌, ఐపిల్‌ టవర్‌ తదితర చోట్ల వేడుకగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు.

తాజాగా అమెరికా రాష్ర్టాలైన నార్త్‌ కరోలినా, జార్జియా, చార్లెట్టే రాలేహ్‌, వర్జీనియా రాష్ర్టాలు బతుకమ్మ పండుగను అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఈ వారాన్ని బతుకమ్మ పండగ, తెలంగాణ హెరిటేజ్‌ వీక్‌గా ప్రకటించారు. బతుకమ్మ వైభవాన్ని, ప్రజలను కలుపుతూ వారి మద్య పెంపొందిస్తున్న సుహృద్భావ వాతావరణాన్ని వారు కొనియాడారు.
గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌, పలు ఇతర సంఘాలు, ప్రవాస తెలంగాణీయులు గత కొంత కాలంగా తెలంగాణ బతుకమ్మకు ఖండాంతరాల్లో గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. తాజా గుర్తింపుతో వారి కృషికి ఫలితం దక్కినైట్లెంది. గతంలో సైతం కొన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు బతుకమ్మకు అధికారిక గుర్తింపునిచ్చాయి.

నార్త్ కరోలినాలో బతుకమ్మ సంబరాలు

అమెరికాలో నార్త్ కరోలినా లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో … బతుకమ్మ పాటలతో తెలంగాణ సంప్రదాయం మురిసింది.. తెలంగాణ ఆడపడుచులు సంప్రదాయ వస్ర్తాలు ధరించి పూలతో బతుకమ్మలను పూజించారు..

- Advertisement -

స్కాట్ లాండ్ లోనూ..

స్కాట్ లాండ్ లోని గ్లాస్గోలో నగరంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగుతున్నాయి. డాక్టర్ పునీత్ బేడి, రష్మీ నాయక్, డాక్టర్ మమత వుసికెల , వినీల బత్తుల నేతృత్వంలో ప్రతిరోజూ నవరాత్రి, బతుకమ్మలను జరుపుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement